News
పంచభూతాలను కూడా పంచుకుని తింటున్నారు
వైఎస్సార్ సీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ టీడీపీ నేతలు పంచభూతాలను కూడా పంచుకుని తింటున్నారని విమర్శించారు. అసెంబ్లీ భవనంలో వర్షపు నీరు లీకైతే అవినీతి ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతుందన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో శుక్రవారం జరిగిన వైఎస్సార్ సీపీ ప్లీనరీలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో పాలనను గాలికి వదిలేశారని, శాంతిభద్రతలు అదుపులో లేవని ధ్వజమెత్తారు. బయటకు వెళ్లినవారు క్షేమంగా వస్తారన్న నమ్మకం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక నగరంగా అభివృద్ధి చేస్తామన్న విశాఖను భూకబ్జాలమయంగా మార్చేశారని తెలిపారు. ప్రత్యేకహోదాను సైతం నీరుగార్చిన ఘనత సీఎం చంద్రబాబుదే అన్నారు. అధికారంలోకి రావడానికి చంద్రబాబు అబద్ధపు హామీలు ఇచ్చారని పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఆళ్ల నాని తెలిపారు. 600లకుపైగా హామీలిచ్చి ఒక్కటీ నెరవేర్చని ఘనత చంద్రబాబుదే అన్నారు. ఓటుకు కోట్లు కేసు వల్లే ఏపీ ప్రయోజనాలను బాబు తాకట్టుపెట్టారని ఆరోపించారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








